14 April, 2026 | 5:13 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

కార్మికుల పెండింగ్ క్లైములను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

01-11-2025 08:39 PM

నేరేడుచర్ల (విజయక్రాంతి): కార్మికుల పెండింగ్ క్లైములను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నేరేడుచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు యారవ శ్రీనివాస్ అన్నారు. శనివారం నేరేడుచర్ల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన కార్మికుల ముఖ్య సమావేశంలో మాట్లాడుతూ... నిత్యం ఎంతో కష్టపడి పనులు చేస్తున్న కార్మికులందరూ ప్రతి సంవత్సరం సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు.

ప్రభుత్వం కార్మికులకు భరోసా కల్పించాలని, సంక్షేమ బోర్డు నుండి ప్రమాద బీమా 10 లక్షలు, సాధారణ బీమా 2 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు అడ్డాలలో మౌలిక వసతులు కల్పించాలని, వెల్ఫేర్ బోర్టులోని నిధులను కార్మికులకే ఖర్చు చేయాలన్నారు. లేబర్ కార్యాలయాలలో అధికారులను నియమించి కార్మికులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ సత్తార్, కోశాధికారి గుంజ రవీందర్, కోటేశ్వరరావు, షరీఫ్ అజయ్ కుమార్, కరీముల్లా, సైదా, మట్టయ్య, నరేష్, శ్రీను, నాగమ్మ, కొండలు, కరుణాకర్ తదితర కార్మికులు పాల్గొన్నారు.