calender_icon.png 15 July, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు

15-07-2025 12:17:36 AM

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జులై 14 (విజయ క్రాంతి): అనధికార చిట్ ఫండ్, అక్రమ ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సంబంధిత వ్యక్తులపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. ప్రజా దివాస్ కార్యక్రమంలో  భాగంగా జిల్లా నలుమూల నుంచి  వచ్చిన 24 మంది  బాధితులు ఎస్పీని కలిసి తమ సమస్యలు తెలిపారు. ఈ  సందర్భంగా పలువురు బాధితులు అనధికార చిట్ ఫండ్, అక్రమ ఫైనాన్స్ ఆగడాలపై ఎస్పీకి పిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ  జిల్లాలో అనుమతుల్లేని, అనధికార చిట్ ఫండ్ ఫైనాన్స్, దందాలు చేసే వారిపై కేసుల నమోదుతో పాటు చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనధికార చిట్ ఫండ్, అక్రమ ఫైనాన్స్ వ్యాపారం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే జయశంకర్ జిల్లా   ప్రజలు, తమ సమస్యలను సిసిఎస్/ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కు  87126 58108 కు ఫోన్ ద్వారా తెలుపవచ్చని పేర్కొన్నారు. పేదలు, సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురికావద్దనేది పోలీసు శాఖ అభిమతమని ఎస్పీ స్పష్టం చేశారు.