15-07-2025 12:16:57 AM
పీడీఎస్‌యూ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి గణేష్
ముషీరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): విద్యారంగ సమస్యలను పరి ష్కరించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో (పీడీఎస్‌యూ) సోమవారం హైదరాబాద్ జిల్లా డీఆర్‌ఓకు వినతి పత్రం అం దజేసినట్లు పీడీఎస్‌యూ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి గణేష్ తెలిపారు.
ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ సమస్యలపరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ మేడ్చల్ -మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు మందుల సైదులు, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కె. వంశికుమార్ తదితరులు పాల్గొన్నారు.