15 March, 2026 | 9:15 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు

19-06-2025 12:00 AM
  1. గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాల రద్దు

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

కుమ్రం భీం  ఆసిఫాబాద్, జూన్ 18 (వి జయక్రాంతి): జిల్లాలో మాదకద్రవ్యాలను విక్రయించిన, వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం  ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి మాదకద్రవ్యాల నివారణపై పోలీస్, రెవెన్యూ, సంక్షేమ, విద్య, వైద్య ఆరోగ్య, రవాణా, గిరిజన సంక్షేమ, పం చాయితీ రాజ్, వ్యవసాయ, అటవీ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్ర మ రవాణా, విక్రయం, వినియోగాలు జరగకుండా అధికారులు సమన్వయంతో వ్యవ హరించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో గంజాయి సాగు చేయకుండా అధికారులు పర్యవేక్షించాలని, ఎవరైనా గంజాయి సాగు చేసినట్లయితే వారిని గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా లభించే పథకాల లబ్ధిని రద్దు చేయాలని తెలిపారు.

పాఠశాలలు, వసతి గృహాలు, గురు కులాలు, కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని, విద్యాసంస్థల పరిసరాలలో గల కిరాణా దుకాణాలు, పాన్ టేలాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. సరిహద్దు జిల్లా అయినందున పక్క రాష్ట్రం నుండి వచ్చే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేయాలని, ఆటో, లారీ డ్రైవర్లు, కూలీలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

మందుల దుకాణాలలో మత్తుపదార్థాలకు సంబంధించిన విక్రయాలపై తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ డ్రగ్స్ డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, మహిళ సంఘాలతో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ర్యాలీలు నిర్వహించాలని, నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.  జిల్లా ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ మాట్లాడుతూ.. వచ్చే 2 నెలలలో పోలీస్ కళాజాత బృందం వారిచే జిల్లాలలో ప్రతి సోమవారం, గురువారం మాదకద్రవ్యాల నిర్మూలనపై కార్య క్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఎవరైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను విక్రయించి న, వినియోగించిన వారిని గుర్తించి వారిపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలో గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక నిఘా నిర్వహిస్తామని, సరిహద్దు ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపడతామ ని, అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, జిల్లా రవాణా అధికారి రామ్ చం దర్, మాధ్యమిక అధికారి కళ్యాణి, వ్యవసాయ, విద్య, ఆబ్కారీ, జాతీయ రహదారు లు, డ్రగ్స్ శాఖ అధికారులు పాల్గొన్నారు.