15 March, 2026 | 11:51 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

పారదర్శకంగా సంక్షేమ పథకాల అమలు

19-06-2025 12:00 AM

ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 

ఉట్నూర్, జూన్ 18 (విజయక్రాంతి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతి పేదవాడికి అందేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని శాంతినగర్, ఫకీర్ గుట్ట కాలనీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేదల సొంతింటి కలలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజ లెవరూ ఆసత్య ప్రచారాలను నమ్మొద్దని, గత బీఆర్‌ఎస్ పార్టీ 10 ఏళ్లపాటు ఏం చేసిం దో బీఆర్‌ఎస్ నాయకులను నిలదీయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు

ఖానాపూర్, జూన్18 (విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామ ంలో అరులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయడం జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మం జూరు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.