calender_icon.png 25 October, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నివర్గాల అభివృద్ధికి కృషి

25-10-2025 12:24:07 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల అర్బన్, అక్టోబర్ 24 (విజయ క్రాంతి): కుల మతాలకతీతంగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణం 4వ వార్డ్లోని కౌసర్ మసీదు అభివృద్ధి కోసం నిధులు కేటాయించగా అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని మంజూరైన రు. 3 లక్షల 25 వేల చెక్కును మజీద్ కమిటీకి అం దజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోని పలు దేవాలయాలు, మసీదు లు, చర్చ్ ల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

అ న్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్ క్యాదాసు నవీన్ మాట్లాడుతూఎంతోమంది నాయకులు వచ్చారు.. వెళ్లారు. కా నీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాత్రమే మసీదు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారన్నారు .మసీదు అభివృద్ధి పట్ల ఆయన చూపిన ఆసక్తికి, సహకారానికి తామంతా ఎప్పటికీ సం జయ్ అన్నకు తోడుగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా మసీదు కమిటీ సభ్యులు, మైనార్టీ యువకులు ఎమ్మెల్యేను సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు క్యాదాసు నాగయ్య, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, చెట్పల్లి సుధాకర్, క్యాదాసు నవీన్, కూసరి అనిల్, ఇర్ఫాన్, గాదె కార్తీక్, మజీద్ తదితరులు పాల్గొన్నారు.