calender_icon.png 25 October, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

25-10-2025 12:23:31 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, అక్టోబర్ 24 (విజయ క్రాంతి):  రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం అన్నారు. శుక్రవారం  నార్కెట్పల్లి మండలంలోని చౌడంపల్లి గ్రామంలోని వరలక్ష్మి కాటన్ మిల్లులో సీసీఐ ద్వారా ఏర్పా టు చేసిన పత్తి కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు  సద్వినియోగం చేసుకోని గిట్టుబాటు ధరను పొందాలని, దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ చైర్మన్ నర్రా వినోద - మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఐతరాజు యాదయ్య, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

పేద కుటుంబానికి పెద్దన్నగా వీరేశం 

నకిరేకల్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఓ  నిరుపేద కుటుంబానికి పెద్దదిక్కు పెద్దన్న లాగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశ నిలిచ్చారు. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామా నికి చెందిన నిరుపేద కుటుంబం రుద్రాక్షి పుష్పయాదగిరి దంపతులకు ప్రభుత్వం ద్వారా సన్నబియ్యం అందాయి.  గతంలో సంతోషంగా నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం గుడిసె కు ఆహ్వానించి సన్నబియ్యం తో అన్నం పెట్టారు.

ఆ గుడిసె లో సన్నబియ్యం తో అన్నం తిని ఆ కుటుంబానికి ఆయన అండా నిలిచాడు. రెక్కల కష్టం నమ్ముకుని బ్రతుకీడుస్తున్న.. ఆ కుటుంబానికి.ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇళ్లు ను మంజూరు చేయించి తానే స్వయంగా  వెళ్లి ఆయన శంకుస్థాపన చేసి ఆ కుటుంబంలో వెలుగులు నింపాడు.

అసలే పేద కు టుంబం ఇల్లు ఎలా కట్టుకుంటారని గ్రామస్థుల్ని అడిగి తెలుకున్న ఆయన తనవంతుగా కొంత సహాయం చేయాలని బావించి శుక్రవారం 50 వేల రూపాయలను ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు  కృతజ్ఞతలు తెలిపారు.