calender_icon.png 24 December, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్తచాటిన ఆదిలాబాద్ జట్టు

05-11-2024 04:05:30 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడ పాఠశాలలో గడిగొప్పుల సదానందం(పీడి) జ్ఞాపకార్థం హ్యాండ్ బాల్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి 10 టీంలు పాల్గొనగా ఫైనల్ పోటీల్లో మహబూబ్‌నగర్‌పై ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో మహబూబ్ నగర్, తృతీయ స్థానంలో కరీంనగర్, నాలుగో స్థానంలో రంగారెడ్డి జట్లు నిలిచాయి. విజేతలకు సీఐ రవీందర్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్, మాజీ ఎంపీపీ మల్లికార్జున్ బహుమతులు అందజేశారు.