15 March, 2026 | 12:41 AM

లక్ష బుకింగ్స్ దాటిన హ్యుందాయ్ వెన్యూ

14-03-2026 11:18 PM

గురుగ్రామ్, మార్చి, 2026: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్  తన డైనమిక్ మరియు ట్రెండ్‌సెట్టింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ  సరికొత్త హ్యుందాయ్ వెన్యూ కోసం 1 లక్ష బుకింగ్‌ల భారీ మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, కాంపాక్ట్  ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటూ.. ఆధునిక భారతీయ కస్టమర్లకు మెరుగైన సౌకర్యాన్ని, పనితీరును అందించే కొత్త 'HX8 డీజిల్ ఆటోమేటిక్ (AT)' వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

అద్భుతమైన పనితీరుతో పాటు సునాయాసమైన ప్రయాణాన్ని కోరుకునే కస్టమర్లకు ఈ కొత్త HX8 డీజిల్ AT వేరియంట్ రాక.. హ్యుందాయ్ వెన్యూను మరింత చేరువ చేస్తుందనీ తెలిపింది.6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించబడిన నిరూపితమైన U2 1.5L CRDi డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఈ కొత్త వేరియంట్.. అధునాతన సాంకేతికత, మెరుగైన సౌకర్యం మరియు అద్భుతమైన పనితీరును అందిస్తుందనీ పేర్కొంది.. హుందాగల మరియు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులకు హ్యుందాయ్ వెన్యూ ఆకర్షణను ఇది మరింత పెంచుతుందనీ తెలిపింది.

కొత్త HX8 డీజిల్ AT వేరియంట్ అనేక అప్‌గ్రేడ్ చేయబడిన సౌకర్యవంతమైన, భద్రతాపరమైన మరియు అనుకూలమైన ఫీచర్లతో వస్తుంది. 

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ తరుణ్ గర్గ్ మాట్లాడుతూ కొత్త హ్యుందాయ్ వెన్యూ 1 లక్ష బుకింగ్‌లను దాటడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా బ్రాండ్‌పై భారతీయ కస్టమర్లకు ఉన్న బలమైన నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది. స్మార్ట్, కనెక్టెడ్ మరియు ఫీచర్-రిచ్ మొబిలిటీ సొల్యూషన్స్ (వాహనాల) పట్ల పెరుగుతున్న ఆకాంక్షలను ఈ మైలురాయి ప్రతిబింబిస్తుంది. కొత్త HX8 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ పరిచయం వెన్యూ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ఇది వినియోగదారులకు డీజిల్ ఎఫిషియెన్సీ, టార్క్-రిచ్ పెర్ఫార్మెన్స్ మరియు సునాయాసమైన సౌలభ్యంల అద్భుతమైన కలయికను అందిస్తుందని చెప్పారు.