calender_icon.png 13 February, 2026 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు

13-02-2026 12:55:15 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, ఫిబ్రవరి 1౧ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు.

సమయపాలన అత్యంత ముఖ్యమని, సిబ్బంది నిర్ణీత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు హాజరుకా వాలని ఆదేశించారు. అన్ని నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ, పారదర్శకంగా వేగవంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు వీరారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో పోలింగ్ విజయవంతంగా నిర్వహించినందుకు సిబ్బందిని అభినం దించారు. అదే క్రమశిక్షణతో ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం కౌంటింగ్ హాలుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కౌంటింగ్ కేంద్రంలో పోలీసు భద్రత

జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద క. కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గురువారం కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్, బారికేడింగ్, ప్రతినిధులు,అధికారులు, సిబ్బంది ప్రవేశంపై పాటించాల్సిన విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ తో పాటు, భైంసా ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐ లు ఉన్నారు.