24-11-2025 10:36:50 AM
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా(Nizamabad Gurukul School) గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేగింది. చందూరులోని మైనార్టీ గురుకులంలో పదోతరగతి చదుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని నిజామాబాద్ కు చెందిన విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. హాస్టల్ సిబ్బంది సమాచారంతో ఘటనాస్తలికి చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.