17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

దైవ దర్శనం పేరిట కాసుల దందా..!

24-02-2026 10:26 AM
  1. చిరు వ్యాపారుల వద్ద ముక్కు పిండి వసూళ్లు
  2. కనీస వసతులకు నోచుకోని మల్లన్న భక్తులు.
  3. అక్రమ వసూళ్లపై ప్రశ్నించినందుకే దాడి ఘటన. 
  4. పట్టించుకోని అధికార యంత్రాంగం.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టుపై(Kummera Gutta Jatara) జరుగుతున్న మల్లన్న జాతరలో దైవ దర్శనం పేరుతో కాసుల దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతరకు వచ్చే భక్తుల నుంచి, అక్కడ తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దారాలు, బుంగలు అమ్ముకునే వారితో పాటు సోడా లెమన్ పాణ్యం అమ్ముకునే వారి వద్ద కూడా వేలల్లో డబ్బులు దండుకుంటున్నారని విమర్శలున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోయినా దర్శనం, పార్కింగ్, షాపుల ఏర్పాట్ల పేరుతో నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, భద్రత వంటి ప్రాథమిక సదుపాయాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్లన్న గట్టు పైకి ఎక్కేందుకు భక్తులకు సరిపడా దారి కూడా ఏర్పాటు చేయకపోయినా దాని పేరుతో మాత్రం అడ్డగోలుగా దోచుకుంటున్నారని భక్తులు మండిపడుతున్నారు.  

అక్రమ వసూళ్లపై ప్రశ్నించిన కొందరిపై దాడి జరిగినట్టు సమాచారం. ఈనెల 18న అదే గ్రామానికి చెందిన గణేష్ అనే బిసి కుటుంబంపై నిర్వాహకులు దాడి చేసి రెండు నెలల పసిబిడ్డ ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, అధికార యంత్రాంగం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐదు రోజులపాటు కొనసాగే జాతర పేరుతో భారీ మొత్తంలో డబ్బులు పోగు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆలయం పరిసరాలు కుమ్మెర గ్రామశివారులో, జాతర నిర్వహణ స్థలం పూర్తిగా కారుకొండ గ్రామ శివారు లోకి రావడంతో రెండు గ్రామాల పెద్దలు చిరు వ్యాపారుల నుండి భారీగా వసూళ్ల పర్వానికి పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆలయ అభివృద్ధి, జాతర నిర్వహణ సౌకర్యాల పేరుతో వసూళ్లు చేసిన ముడుపులను గ్రామస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు పంపకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ వసూళ్లను అరికట్టి, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు