calender_icon.png 4 August, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య

03-08-2025 10:34:45 PM

ఎందుకు ఆత్మహత్య కు పాల్పడిందో అంతు చిక్కని ప్రశ్న

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ సౌత్ క్యాంపస్‌లో ఆదివారం రాత్రి పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూరు మండలం కిష్టాపూర్  గ్రామానికి చెందిన దండు అశ్విని(23) విద్యార్థిని భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం  చదువుతుంది. ఓకే గదిలో ఇద్దరు విద్యార్థిని లు ఉంటున్నారు. గదిలో ఉండే మరో విద్యార్థిని గదిలో లేని సమయంలో సిలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు క్యాంపస్ వర్గాలు తెలిపాయి. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

వారి కుటుంబ సభ్యులు వస్తేనే వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. శవాన్ని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెలంగాణ సౌత్ క్యాంపస్ లో పిజి ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య కు పాల్పడడం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతుంది. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య పాల్పడిందా లేక కళాశాలలో ఎవరైనా ర్యాగింగ్ కు  పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు వచ్చి ఫిర్యాదు చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. సౌత్ క్యాంపస్ అధ్యాపకులు, విద్యార్థులు దండు అశ్విని శవాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.