03-08-2025 10:37:54 PM
మునగాల,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సేవలను గుర్తించి వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఆదివారం గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ ఎండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధం మండల కమిటీ సమావేశం మామిడి వెంకన్న అధ్యక్షతన జరిగినది.
ఈ సమావేశo లో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ గ్రామాలలో పారుశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిలైట్లు, డంపింగ్ యార్డ్స్,హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు తదితర పనులు వివిధ కేటగిరీల వారీగా పనిచేస్తు. అనారోగ్యాలు రాకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడుతు పంచాయతీ కార్మికులుగా సేవలందిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, జీవో నెంబర్ 51 ని సవరించాలని మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని కారోబార్, బిల్ కలెక్టర్ల, ను స్పెషల్ స్టేటస్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినారు.