calender_icon.png 4 August, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద విద్యార్థి చదువుకు అపన్న హస్తం అందించిన 'ప్రజాసేవ' సంస్థ

03-08-2025 10:20:41 PM

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని ఒకటో జోన్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఎగ్గేటి రుతిక్ విద్యాభ్యాసానికి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మేమున్నామని ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. దాతల సహకారంతో సేకరించిన రూ.5000 నగదును ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అంద చేశారు.

ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్, ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్ లు మాట్లాడారు. పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన రుతిక్ స్కూలు ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని స్థానికులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం అందివ్వడంతో స్పందించిన సంస్థ సభ్యులు దాతల సహకారంతో 5000 రూపాయలు సేకరించి విద్యార్థి కుటుంబ సభ్యులకు అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ... పట్టణ ప్రజలు తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదరికంతో, ఎలాంటి ఉపాధి లేకుండా బాధపడుతున్న వారి వివరాలను తమ దృష్టికి తీసుకు వస్తే వారికి సంస్థ పరంగా సహాయ సహకారాలు అందించి వారికి అండగా నిలుస్తామన్నారు. కాగా నిరుపేద విద్యార్థి స్కూల్ ఫీజుల కోసం సహకరించిన తన్నీరు మధుకర్, బిర్లా టిఎస్ఎం దాడి రాజు లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.