calender_icon.png 10 December, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలకు వెళ్తున్న ఆటో బోల్తా.. విద్యార్థి మృతి

10-12-2025 11:00:20 AM

హైదరాబాద్: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో(Savargaon Village) బుధవారం విషాదం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి పదో తరగతి చుదువుతున్న ప్రణవ్ (15)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతి, మిగిలిన వారికి గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.