30 August, 2026 | 11:47 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

చెరువులో పడి విద్యార్థి మృతి

22-09-2025 07:52 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తూ చెరువులో పడి సాయి చరణ్(15) విద్యార్థి మృతి చెందినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ కొండ సోమవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సెలవులపై ఇళ్లకు వచ్చిన విద్యార్థులు ఇంటిపట్టునే ఉండాలని, వాగులు వంకల వెంట తిరుగుతూ తల్లిదండ్రులను తీవ్ర బాధకు గురిచేయవద్దని మృతుడి తండ్రి పేర్కొన్నారు.