calender_icon.png 22 September, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

22-09-2025 07:52:54 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. మంగళహారతులు, బ్యాండ్ చప్పుళ్ళ నడుమ దుర్గాదేవి అమ్మవారికి మహిళలు వైభవంగా స్వాగతం పలికారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు.నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవంలో మాజీ కౌన్సిలర్ పూలు ఉమాదేవి శ్రీనివాస్, భవాని ఉత్సవ కమిటీ సభ్యులు తిరుపతి, జి. అనుదీప్ పటేల్, క్రాంతి, రాజు, వంశీ, సన్నీ, లతోపాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.