22-09-2025 07:49:42 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం 2 నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాల ట్రాక్టర్ ను అర్ధరాత్రి పట్టుకున్నట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. వెంటనే స్పందించిన మండల అగ్రికల్చర్ అధికారిని సుప్రజ్యోతి సోమవారం రోజున ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం 2 తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో రికార్డులు సరిగా రాయడం లేదని కొన్ని యూరియా బస్తాలను రసీదులు లేకుండా పంపించడం జరిగిందని, ఈ ఆగ్రో రైతు సేవా కేంద్రంపై ఎఫ్. సి. ఓ కు ఈ సేవా కేంద్రానికి యూరియా పంపించరాదని రికమెండ్ చేస్తూ లైసెన్స్ ను కూడా సస్పెండ్ చేయాలని కోరుతూ లెటర్ రాయడం జరిగిందని, ఈ ఆగ్రో రైతు సేవా కేంద్రం 2 కు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగిందని అగ్రికల్చర్ అధికారిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు వ్యవసాయ క్షేత్రాధికారులు పాల్గొన్నారు.