విద్యుత్తు షాక్‌తో విద్యార్థి మృతి
ఎల్బీనగర్, జూన్ 21: హాస్టల్‌లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని ఓ విద్యార్థి అర్ధరాత్రి ప్రహరీ దూకి పారిపోవాలని ప్రయత్నించగా, కరెంట్ తీగలు తగిలి షాక్‌తో మృతిచెందాడు. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని తెనాలికి చెందిన కర్రె గిరీశ్ కుమార్ (16) అనే విద్యార్థి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలోని నారాయణ జూనియర్ కళా శాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు అతడిని నాలుగు రోజుల క్రితమే క్యాంపస్‌లో చేర్పించారు. తాను ఇక్కడ చదవనని.. ఇంటికి తీసుకెళ్లాలని రెండు రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేయగా, ఆదివారం వచ్చి తీసుకెళ్తామని చెప్పారు.
దీంతో మనస్తాపం చెందిన గిరీశ్‌కుమార్ గురువారం అర్ధరాత్రి క్యాంపస్ గోడ దూకి పారిపోవాలని ప్రయత్నించాడు. గోడ దూకే క్రమంలో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం తెల్లవారుజామున గిరీశ్‌కుమార్ రూమ్‌లో కనిపించకపోవడంతో తోటి విద్యార్థు లు వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. కళాశాల సిబ్బంది పరిసరాల్లో చూడ గా గోడ పక్కన విగతజీవిగా పడి ఉండడం గమనించి తల్లిదండ్రులతో పాటు హయత్‌నగర్ పోలీసులకు స మాచారం ఇచ్చారు. మృతుడి తల్లిద ండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






