విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన బైక్
ఇద్దరు యువకులు మృతి
చార్మినార్, జూన్ 21: బైక్‌పై విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెం దారు. ఈ ఘటన ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీపీ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. పాతబస్తీ ఛత్రినాకలోని జయప్రకాష్ నగర్‌కు చెందిన అమర్ సింగ్ కుమారుడు రాధా కిషన్ ఠాకూర్ (24) వృతి ్తరీత్యా ఏసీ మెకానిక్. రాధాకిషన్ తన పుట్టినరోజు కావడంతో బైక్‌పై తన ఇద్దరు స్నేహితులు అయి న వైజనాథ్ ఇంగ్లే అలియాస్ సోను (30), కే నిఖిల్ కుమార్(18)తో కలిసి గురువారం అర్ధరాత్రి బిర్యానీ తినడానికి వెళ్లారు.
తిరిగి తెల్లవారుజామున చాంద్రాయణగుట్ట వైపు నుంచి కందికల్ గేట్ ఫ్లు ఓవర్ మీదుగా ఛత్రినాక వైపు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ఫ్లు ఓవర్‌పై విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా స్థానికులు గుర్తించి రాధా కిషన్‌ను ఎల్బీనగర్‌లో ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా వైజనాథ్ మృతిచెందాడు. నిఖిల్ చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై ఛత్రినాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






