11 May, 2026 | 4:04 PM

మామిడ్గిని సందర్శించిన వైద్యాధికారులు

22-06-2024 01:12 AM

ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య సిబ్బంది

వారం రోజుల పాటు వైద్య క్యాంపు కొనసాగింపు

జహీరాబాద్, జూన్ 21: సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడ్గి గ్రా మాన్ని జిల్లా వైద్యాధికారులు, మండల అధికారులు శుక్రవారం సందర్శించారు. గ్రామంలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలపై జిల్లా అధికారులు స్పందించారు. వారి ఆదేశాలతో జిల్లా మలేరి యా వైద్యాధికారి డా. ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో సురేశ్ గ్రామాన్ని సందర్శించారు. బీదర్‌లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న బిందు రెడ్డి, శైలేందర్ రెడ్డి ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిం చారు. అక్కడ వారికి పరీక్షలు చేసిన రిపోర్టులను పరిశీలించారు.

అయితే, వారివి డెంగ్యూ అనుమానిత కేసులని, వాటిని పూర్తిగా డెంగ్యూ కేసులని నిర్ధారించలేమని డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అయినా ముందు జాగ్రత్తగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైద్య సిబ్బంది రక్త నమూనాలను సేకరిస్తున్నారని తెలిపారు. వారం రోజుల పాటు గ్రామంలో వైద్య క్యాంపు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఇక నుంచి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎంపీ డీవో సురేశ్ గ్రామస్తులకు హామీ ఇచ్చా రు.  కార్యక్రమంలో మామిడ్గి ఆరోగ్య ఉప కేంద్రం వైద్యాధికారి హర్షవర్దన్ రెడ్డి, మిర్జాపూర్ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది మల్లికార్జున్, చండీదేవి తదితరులు పాల్గొన్నారు.