15 June, 2026 | 3:21 PM

Breaking News

ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు   •   శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం   •   తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •  

నిన్న పుట్టిన రోజు వేడుకలు.. ఇవాళ రైలు పట్టాలపై మృతదేహం

11-06-2025 06:35 PM

మైల్వార్: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటచేసుకుంది. పదోతరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బషీరాబాద్ మండలం, మైల్వార్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బషీరాబాద్ మండలం, మైల్వార్ గ్రామానికి చెందిన శాంతు విద్యార్థి పదోతరగతి చదువుతున్నాడు. మంగళవారం కొడంగల్ మండలం హుస్నాబాద్ లో పుట్టిన రోజుల వేడుకలు ఉన్నాయని నలుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఇవాళ బషీరాబాద్-సెడం(కర్ణాటక) మధ్య రైలు పట్టాలపై మృతుడై నిపించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిన్నటి వరకు తమ కళ్లముందే ఉన్న కుమారుడు ఇవాళ రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కుటుంబీకుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాద చాలయాలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.