calender_icon.png 10 July, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహిత ఆత్మహత్య

03-07-2025 12:00:00 AM

అయిజ, జూలై 2: పట్టణంలోని రాయచూరు చౌరస్తాలో నివాసం ఉంటున్న వివాహిత భువనేశ్వరి (23) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారంగా . అయిజ కు చెందిన భువనేశ్వరి కి వారి సమీప బంధువు వెంకటేష్ తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వెంకటేష్ కిరాణా దుకాణంలో పనిచేస్తూ భార్యను పోషిస్తున్నాడు.

ఈ క్రమంలో పెళ్లై మూడేళ్లైనా పిల్లలు కాలేదని భార్యాభర్తలు మనస్థాపంతో చాలాసార్లు బాధపడ్డారని ఈ విషయంపై తీవ్ర మనస్థాపానికి గురైన భువనేశ్వరి మంగళవారం రాత్రి భర్త ఇంటకి రాకముందు ఫ్యాన్ కు ఉరివేసుకుంది. వెంకటేష్ ఇంటికి వచ్చి తలుపు తీయాలని భార్యను పిలవగా స్పందించకపోవడంతో అనుమానంతో వాకిలి పగలగొట్టాగా భువనేశ్వరి అపస్మారక స్థితిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించిందన్నారు.

స్థానికుల సహాయంతో ఆమెను గద్వాల ఆసుపత్రికి తరలించగాడాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. శవానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర శ్రీనివాసరావు తెలిపారు.