విద్యార్థుల విజయమే లక్ష్యం
నాలుగు దశాబ్దాలుగా ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సత్తా
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ దాదాపు 37 ఏళ్లుగా విద్యారంగంలో విశేష సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా 400కిపైగా కోచింగ్ సెంటర్లు, 5,500 మందికి పైగా నిపుణులైన అధ్యాపకులతో నీట్, ఐఐటీ-జేఈఈ, ఫౌండేషన్, ఒలింపియాడ్స్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తోంది.
వైద్య ప్రవేశ పరీక్షల కోచింగ్‌తో ప్రారంభమైన ఈ విద్యాసంస్థ ప్రస్తుతం నీట్ (యూజీ), ఐఐటీ-జేఈఈ, ఫౌండేషన్ కోర్సులు, ఒలింపియాడ్స్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తోంది. వేలాది అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యార్థులకు వ్యక్తిగత శ్రద్ధతో బోధన అందిస్తోంది. ప్రతి సంవత్సరం పరీక్షల సరళికి అనుగుణంగా అధ్యయన సామగ్రిని నవీకరిస్తూ, విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే విధంగా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది.
సాంకేతికతను విద్యతో అనుసంధానిస్తూ 24 గంటలూ అందుబాటులో ఉండే డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను కల్పించింది. సందేహ నివృత్తి, వ్యక్తిగత ప్రగతి విశ్లేషణ, ఆడియో-విజువల్ పాఠాలు వంటి ఆధునిక విధానాల ద్వారా క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తోంది. ఇటీవలి సంవత్సరా ల్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఈ సంస్థకు చెందిన విద్యార్థులు అత్యు త్తమ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు.
ముఖ్యంగా తెలంగాణకు చెందిన విద్యార్థులు కూడా దేశవ్యాప్తంగా మంచి ర్యాంకులు సాధించడం విశేషం. డిజిటల్ విద్యను మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన శిక్షణ అందించడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోంది. దక్షిణ భారత అకాడమిక్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. విద్యార్థులే తమ సంస్థకు కేంద్ర బిందువని, స్మార్ట్ లెర్నింగ్, సాంకేతికత, వ్యక్తిగత మార్గదర్శకంతో ప్రతి విద్యార్థి విజయమే తమ లక్ష్యమన్నారు.






