21 July, 2026 | 11:22 AM

అంతర్జాతీయ పోటీల్లో నారాయణ హవా

21-07-2026 12:00 AM

సైన్స్ ఒలింపియాడ్‌లో 2 స్వర్ణ, 2 రజత పతకాలతో సరికొత్త చరిత్ర

హైదరాబాద్, జులై 20(విజయక్రాంతి): ప్రపంచ స్థాయి పోటీలలో నారాయణ విద్యార్థులు మరోసారి భారతదేశ పేరును అం తర్జాతీయ వేదికపై మారుమోగించారు. ఇటీవల ముగిసిన 37వ అంతర్జాతీయ బయాల జీ ఒలింపియాడ్(ఐబీవో) 2026, 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్(ఐసీహెచ్‌వో) 2026 పోటీలలో నారాయణ విద్యా ర్థులు అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రెండు రజత పతకాలు కైవశం చేసుకున్నారు.

శాస్త్రీయ రంగానికి అద్భుతమైన ప్రతిభను అందించడంలో తమకున్న అగ్రగామి స్థానా న్ని నారాయణ విద్యా సంస్థలు ఈ విజయం తో మరోకసారి చాటిచెప్పాయి. విల్నీయస్, లిథువేనియాలో జరిగిన 37వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్‌లో భవ్యా గున్వాల్ స్వర్ణ, అన్మోల్‌కుమార్, నిషిత్ కలా ని రజత పతకాలు సాధించారు. మొత్తం 78 దేశాల నుంచి 307 మంది విద్యార్థులు పా ల్గొన్న ఈ పోటీలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన నలుగురిలో ముగ్గు రు నారాయణ విద్యార్థులే కావడం విశేషం.

ఆరు గంటల ప్రాక్జికల్, థియరీ పరీక్షలను ఎదుర్కొని టీమ్ ఇండియా మొత్తం ఒక గోల్డ్, మూడు సిల్వర్ పతకాలను సాధించింది.  తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ లో సందీప్ కూచి స్వర్ణ పతకం సాధించా డు. కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో టీమ్ ఇండి యా నాలుగు స్వర్ణ పతకాలతో రికార్డు సృ ష్టించగా, అందులో సందీప్ కూచి కీలక పాత్ర పోషించాడు.

కాగా అంతర్జాతీయ విజయాలతో పాటు మన దేశంలో అత్యంత కఠినమైన పోటీ పరీక్షలలోనూ నారాయణ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకు లు సాధించారు. కొలంబయాలో జరిగిన 56వ అంత ర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో శ్రేష్ఠ్ సుర య గోల్డ్ మెడల్ సాధించగా, ఆ విజయం తో కలిపి కేవలం ఒకే వారంలో నారాయణ విద్యార్థులు మొత్తం మూడు స్వర్ణాలు, రెం డు రజత పతకాలను భారత్ అందించడం గమనార్హం.

నారాయణ విద్యా సం స్థల డైరెక్టర్ శరణి పొంగూరు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు నారాయణ వేదికగా మారిందన్నారు. అంతర్జాతీయ బయాలజీ, కెమిస్ట్రీ ఒలింపియాడ్స్‌లో మన విద్యార్థులు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు సాధించడం  గర్వకారణ మన్నారు. విద్యార్థుల కఠోర శ్రమ, అధ్యాప కు ల అంకితభావం నారాయణ అకడమిక్ వ్య వస్థకి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుందన్నారు.