13-02-2026 12:00:00 AM
ముషీరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాం తి): ఓయూ క్యాంపస్‌లో పీజీ చేస్తున్న ఓ విద్యార్థిని తల్లి తన కూతుర్ని చూడడానికి క్యాంపస్‌కి రావడంతో హాస్టల్ సిబ్బందిలోనికి వెళ్లడానికి అనుమతిని ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన బుధవారం రాత్రి ఓయూ క్యాంపస్‌లో చోటుచేసుకుంది.. విద్యార్థుల కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన ఓ విద్యార్థి ఓయూ క్యాంపస్‌లో పీజీ చేస్తుంది.
బుధవారం ఆ విద్యార్థిని తల్లి మంచిర్యాల నుంచి కూతురిని చూడడానికి ఓయూ క్యాంపస్‌కు వచ్చారు. సేయింటినరి లేడీస్ హాస్టల్ లోనికి వెళ్లి తన కూతుర్ని కలవాలని సెక్యూరిటీ గార్డ్‌ని అనుమతిని అడిగారు. దీంతో అనుమతి లేదంటూ సెక్యూరిటీ గార్డు నిరాకరించారు. విషయం తెలుసుకున్న తన కూతురు సెక్యూరిటీ వారు గార్డు వద్దకు వచ్చి అనుమతి అడిగిన లోపలికి రావడానికి అనుమతించకపోవడంతో హాస్ట ల్లో ఉన్న విద్యార్థులంతా రోడెక్కి ఆందోళనకు దిగారు.
రాత్రి పదిన్నర గంటల సమయంలో స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రాజేందర్ నాయక్ ఆందోళనకారులకు వద్దకు వచ్చి ఆందోళనను విరమించాలని చెప్పి నచ్చ చెప్పినప్పటికీ వినకపోవడంతో వెనుతిరిగారు. ఈ క్రమంలోనే ఏసిపి ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను అరెస్టు చేసి అంబర్‌పేట్ పీఎస్‌కు తరలించినట్లు సమాచారం.