calender_icon.png 13 February, 2026 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులపై కేంద్రం యుద్ధం చేస్తుంది

13-02-2026 12:00:00 AM

చట్టాలు కార్మికులకు మేలు చేసేలా ఉండాలి

జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ 

మహబూబ్ నగర్ టౌన్, ఫిబ్రవరి 12 : కార్మికులపై కేంద్రం యుద్ధం చేస్తుందని ఇది సరైన పద్ధతి కాదని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, రైతు వ్యవసా య కార్మిక సంఘాల ,సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎంపీ గెస్ట్ హౌస్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని దివాలా తీయించడానికి, కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి, ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించడానికి, బ్యాంకులను కుదించడం, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ బహుళ జాతి కంపెనీలను ఆహ్వానించి దేశ సంపాదన మొత్తం విదేశాలకు కట్టబెట్టడానికి, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాడని, ఎనిమిది గంటల పనిని పెంచడం, కనీస వేతనాలు లేకుండా యాజమాన్యాలు మోసం చేయడానికి, సంఘం పెట్టుకునే హక్కులు ,పోరాట హక్కులు ,భేరసారాల హక్కులు హరిస్తున్నాడని, బ్రిటిష్ వాడిచ్చిన సమ్మె హ క్కు, సంఘం పెట్టుకునే హక్కును కూడా కాలరాయడాన్ని, ఉద్యోగ కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్,టి యు సి ఐ రాష్ట్ర నాయకులు శ్రీ వెంకటేష్, బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు జెట్టి రాజేష్, తిరుమల్ రెడ్డి, సంతోష్ ,నవీన్ సాగర్ ,శ్రీనివాస్ ,ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు ఎన్. కిష్టయ్య, బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సి.కృష్ణయ్య, ఎల్‌ఐసి ఐసిఈయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేశ్వర్, రీటైర్డ్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కలమంద రామదాస్ తదితరులు ఉన్నారు.