03-12-2025 12:56:58 AM
సర్వజ్ఞ పాఠశాలలో ఘనంగా నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని వీడిఓస్ కాలనీ సర్వజ్ఞ పాఠశాలలో మంగళవారం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చైర్మన్ ఆర్.వి. నాగేంద్రకుమార్ మాట్లాడుతూ.. కాలుష్యం నియంత్రణ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు.
భోపాల్ గ్యాస్ విషాద ఘటన పరిసరాల రక్షణపై మరుపురాని పాఠాన్ని నేర్పిందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే అత్యవసరమన్న సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థు లు కాలుష్యం నియంత్రణ అనే అంశంపై చిన్న నాటిక ప్రదర్శించి, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కలిగించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కాలుష్యం నియంత్రణ మార్గాలు, చెట్ల ప్రాధాన్యం, పర్యావరణ సంరక్షణ వంటి అంశాలపై సూచనలు అందజేశారు. చైర్మన్ ఆర్.వి. నాగేంద్ర కుమార్ గారి అధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు చేత కాలుష్య నివారణ కి తీసుకునే జాగ్రత్తలపై ఎంతో గొప్పగా ప్రతిజ్ఞ చేశారు.