16 March, 2026 | 11:43 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

యాంటీ డ్రగ్ సైనికుల్లా విద్యార్థులు

21-01-2025 12:00 AM

ఏఎస్పి శేషాద్రిని రెడ్డి 

కోనరావుపేట, జనవరి 20: ప్రతి ఒక్క విద్యార్థి యాంటీ డ్రగ్ సైనికుల్లా పనిచేయా లని, అప్పుడే గంజాయి మత్తు పదార్థాలను తరిమి కొట్టిన వాళ్లమవుతామని వేముల వాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి సూచించారు. సోమవారం కోనరావుపేట మండలం ధ ర్మారం జడ్పి ఉన్నత పాఠశాలలో  పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై ,గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి హాజరై, మాట్లాడారు.

విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో భాగస్వామ్యం కావాలని, మాధకద్రవ్యాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని అందులో భాగంగా జిల్లాలో విద్యార్థులు, ఉపాధ్యా యుల భాగస్వామ్యంతో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పటు చేసి జిల్లాలోని అన్ని పాఠశాలలో, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు ఏ ర్పాటు చేస్థామన్నారు.

ప్రతి విద్యార్థి యాం టీ డ్రగ్ సైనికుడిగా ఉంటూ జిల్లాలో గంజా యి లాంటి మత్తు పదార్థాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థిని, విద్యా ర్థులు జీవితంలో ఉన్నత విజయాలను చేరు కోవడానికి హార్డ్ వర్క్ యే ప్రధాన అస్త్రం అని,కష్టపడే తత్వమే విజయాల దరికి చేరు స్తుందన్నారు.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా తా ము ఎంచుకున్న లక్ష్యం కోసం చేసే ప్రయ త్నాలను మధ్యలో నిలిపివేయకుండ ఆత్మవి శ్వాసంతో క్రమశిక్షణతో, ప్రణాళికతో ముం దుకెళ్లాలన్నారు.ప్రతి విద్యార్థి ఒక సారి చేసిన తప్పును మళ్లీ చేయకుండ ఆ తప్పులు నుండి నేర్చుకొని విజయాలు సాధించాలని, విద్యా ర్థులు ఎప్పుడు తమకు తామే పోటీ అనుకో వాలే తప్ప ఇతరులతో తమను తాము దేనిలోనూ పోల్చుకోవద్దని సూచించారు.

పరీక్షలలో మార్కులు తక్కువ, మధ్యస్థంగా వచ్చిన ఎవరు బాధపడనవసరం లేదని, గొప్ప గొప్ప స్థాయికి వచ్చినా వారంతా అవ్యరేజ్ స్టూడెంట్స్ అన్న విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేశారు.ప్రతి విద్యార్థి ఒత్తిడిని అధిగమించడానికి యోగ, మెడిటే షన్, బుక్స్ చదవడం లాంటివి అలవర్చుకో వలన్నారు ట.

విద్యార్ధిని, విద్యార్ధుల సోషల్ మీడియా (ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్)కు దూ రంగా ఉండాలని,ప్రస్తుతం మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు, సోషల్ మీడి యా వేధింపులు ఆన్లైన్ వేధింపులు, సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతు న్నాయని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, మహిళలు యువతులు ఎలాం టి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్ నంబ ర్ 87126 56425 సమాచారం ఇవ్వగల రని, సమాచారం అందించిన వారి వివరా లు గోప్యంగా ఉంచుతామని ఏఎస్పీ పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు ప్రశాం త్ రెడ్డి,రాహుల్ రెడ్డి, ఎంఈఓ మురళి నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.