calender_icon.png 2 August, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

01-08-2025 06:32:21 PM

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

చిట్యాల (విజయక్రాంతి): హాస్టల్ విద్యార్థులకు సరైన సౌకర్యాలను కల్పించడం లేదని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(former MLA Gandra Venkataramana Reddy) అన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ మోడల్ విద్యాలయాలను బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి ఆయన సందర్శించారు. విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్లు సరిగ్గా శుభ్రం చేయడం లేదని, విద్యుత్ సరిగ్గా ఉండడంలేదని విద్యార్థులు చెప్పారని తెలిపారు.

హాస్టల్ పరిసర ప్రాంతం మొత్తం పిచ్చి మొక్కలతో నిండి ఉందన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి స్టడీ రూమ్, ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్ లేదన్నారు. ఇప్పటివరకు కాస్మోటిక్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ ,పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు తౌటం నవీన్, పిట్ట సురేష్ బాబు, పాండ్రాల వీరస్వామి, చిలుముల రమణాచారి, పెరుమండ్ల రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.