calender_icon.png 2 August, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం

01-08-2025 06:29:43 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ద్వారా అంతర్జాతీయంగా అనేక సేవలను అందిస్తూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తో ప్రశంసలు పొందిన సేవసంస్థ లయన్స్ క్లబ్ ఒకటేనని లయన్స్ క్లబ్ 320జి మొదటి ఉప గవర్నర్ మోర భద్రేశం(Deputy Governor Mora Bhadresham) అన్నారు. రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ సర్వసభ్య సమావేశం కొత్తపల్లి క్లబ్ లో అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశానికి మొదటి ఉప గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ ఫ్యామిలీ క్లబ్ గా గత 15 సంవత్సరాలుగా అదే కల సేవలను అందిస్తున్నదని 320జి లో మంచి గుర్తింపు కలిగిన క్లబ్ అని కొనియాడారు.

మంచి సేవా గుణములు కలిగిన సభ్యులు  ఉండడం వల్ల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశంసలు పొందుతుందని, కార్యదర్శి బండ కిషన్ రెడ్డి జూలై మాసంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా క్లబ్బులో ఆరుగురు నూతనంగా క్లబ్ మెంబర్షిప్ తీసుకున్న సభ్యులకు ఉప గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సీనియర్ క్లబ్ మెంబర్స్ రాళ్ల బండి శశికళ, శంకర్ ప్రసాద్ రెడ్డి, ముప్పిడి ఉషావాని రాజశేఖర్ రెడ్డి, వేల్పుల శశికళ, బాలకృష్ణారావు, చాడ మల్లారెడ్డి, బండ గోపాల్ రెడ్డి, గుండెటి రామచంద్రం, లంబురాజి రెడ్డి, సంధి మోహన్ రెడ్డి,సి హెచ్ రమణారెడ్డి, పిన్నింటి నారాయణరెడ్డి, ఆర్, గోపాల్ రెడ్డి, కర్ర విద్యాసాగర్ రెడ్డి ,చాలా కిషన్ రెడ్డి, ఆర్, తిరుపతి, సిహెచ్ నాగేశ్వరరావు, జాడి బాల్ రెడ్డి, సంజీవరెడ్డి మరియు కుమారస్వామి పాల్గొన్నారు.