calender_icon.png 2 August, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీమా పథకాలతో కుటుంబాలకు భరోసా

01-08-2025 06:35:47 PM

కోనరావుపేట (విజయక్రాంతి): ప్రజలందరూ భీమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భీమా పథకాల ద్వారా కుటుం బాలకు భరోసా ఉంటుందని యూనియన్ బ్యాంక్ అధికారులు సూచించారు. జన్ సురక్ష కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో శుక్రవారం యూనియన్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కోనరావుపేట వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం కల్పించిన భీమా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులందరికి భీమాను వర్తింపజేశారు. ఇందులో భాగంగా పిఎంఎస్బీవై, పిఎంజెజెబివై, అటల్ పెన్షన్ యోజన అనే పథకాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ వంశి, బిసి కమటం ఆదర్శ్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్లు ఎం. శ్రావణ్ కుమార్, ఏల్ బివో యోగేశ్వర్, ఓ. అభిషేక్, ఓ. వంశీకృష్ణ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.