calender_icon.png 20 January, 2026 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ కు విద్యార్థుల వినతి

20-01-2026 05:29:04 PM

 బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత నవంబర్ నుండి నేటి వరకు బోటనీ అధ్యాపకుడు లేక 84 మంది విద్యార్థులు వృక్షశాస్త్ర చదువుకు దూరమైపోయారు. వచ్చే నెల రెండవ తేదీన ప్రాక్టికల్స్ ఉండగా దానికోసం కావలసిన ప్రిపరేషన్ లేదు. రికార్డ్స్ కూడా పూర్తి చేయలేదు దీంతో విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సపన్ కుమార్ మండల్ కు వినతి పత్రం అందించినట్లు తెలిపారు.