calender_icon.png 20 January, 2026 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి నిరంతర ప్రక్రియ

20-01-2026 05:33:34 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధి 58వ డివిజన్ ఎన్జీవోస్ కాలనీలో పైప్ లైన్ నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ... నియోజకవర్గంలో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, అన్ని డివిజన్ లలో సమిష్టి అభివృద్ధి జరుగుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి చారించామని తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం కాజీపేట రైల్వే సంఘం కార్యాలయంలో పెన్షనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని సంఘం తరఫున విడుదల చేసిన ప్యాకెట్ డైరీలను ఆవిష్కరించారు. పెన్షనర్లు సమాజానికి అందించిన సేవలు ఎనలేనివని వారి సమస్యల పరిష్కారానికి, విశ్రాంత ఉద్యోగుల యోగక్షేమాల కోసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తప్పకుండా స్థలం కేటాయింపు చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు బంక సంపత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి మెరుగు శివ, వరంగల్ పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎం.డి నేహాల్, ఫిషర్ మాన్ సభ్యులు మండల సమ్మయ్య, 58, 60 డివిజన్ ల అధ్యక్షులు తాళ్లపల్లి సుధాకర్, ఎనుకొంటి పున్నంచందర్, కాంగ్రెస్ శ్రేణులు తాళ్లపల్లి మేరీ, తాళ్లపల్లి విజయ్, తాళ్లపల్లి రవీందర్ (జెకె), జనగాం శ్రీనివాస్ గౌడ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు గన్నేబోయిన శ్వేతా గణేష్, ఎండి సాజిద్, అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు