20-01-2026 05:25:26 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తాహసిల్దార్ బిమ్లా నాయక్ వినతి పత్రం అందజేశారు. గత మూడు నెలల నుండి బాటనీ అధ్యాపకులు లేక విద్యార్థుల చదువులు వార్షిక పరీక్షలు ప్రాక్టికల్స్ ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు తాహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ భీమ్లా నాయక్ వినతి పత్రం అందించినట్లు తెలిపారు.