2 April, 2026 | 5:23 PM

విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

02-04-2026 03:59 PM

సర్పంచ్ అరుణా దేశ్ పాండు నాయక్ 

మఠంపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో  బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ హాజరై మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని,ఉన్నంత విద్య అభ్యసించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.