14 June, 2026 | 4:18 PM

Breaking News

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •  

విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి

07-12-2024 02:18 AM

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు, అధ్యాపకుల చేతు ల్లో ఉందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ మండలం రాం నగర్ సెయింట్ పైస్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

డీఈవో రోహిణితో కలిసి ప్రదర్శనలో విద్యార్థుల ఎగ్జిబిట్లను పరశీలించారు. విద్యార్థులు సృజనాత్మకత, నైపుణ్యాన్ని పెంపొందించుకో వాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఈవో చిరంజీవి, సెయింట్ పైస్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ లిండా జరాల్డ్, కోఆర్డినేటర్ జ్యోతి, ఎమ్మార్వో రాణాప్రతాప్‌సింగ్, జిల్లా సైన్స్ అధికారి ధర్మేందర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని 78పాఠ శాలల నుంచి వచ్చిన విద్యార్థులు 147 సైన్స్ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు.