17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

24-11-2025 05:30 PM

షీ టీం అవగాహన సదస్సులో స్నేహలత

సుల్తానాబాద్ (విజయక్రాంతి): విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీ టీం మెంబెర్ స్నేహలత సూచించారు. రామగుండం సి.పి ఆదేశాల మేరకు షీ టీమ్ ఇంచార్జి ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, యాంటీ డ్రగ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఎవరైనా చెడు గా మాట్లాడిన, ప్రవర్తించిన తల్లిదండ్రులకు తెలియజేయాలని, వాటి నుంచి ఎలా బయటపడటంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్ ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా నిగా ఉంచడం జరుగుతుందని, ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే  సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి  సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, షీ టీమ్ సభ్యులు మౌనిక, సురేష్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.