24-11-2025 05:27:31 PM
మహిళలకు చీరలు పంపిణీ చేసిన తహసీల్దార్ దయానందం..
తుంగతుర్తి (విజయక్రాంతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నేత కార్మికులు తయారుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని తుంగతుర్తి తహసిల్దార్ దయానందం తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని మండల మహిళ సమాఖ్య కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మండల కేంద్రం చేసిన వివో 1, వివో 2, వివో 3 గ్రామ సంఘంలోని మహిళల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాహసీల్దార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పథకాన్ని మహిళల పేరుతో అమలు చేస్తుండడం శుభ సూచకమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండోరోజు నుంచే మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నామని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యంతో పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపకల్పన చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం అశోక్ కుమార్, సీసీలు, వివో ఏలు, వివోబీలు, మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.