20-12-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
హనుమకొండ,డిసెంబర్ 19 (విజయ క్రాంతి): శాస్త్ర, సాంకేతిక రంగాలలో మరింత అభివృద్ధి చెందాలని,అప్పుడే విశ్వ గురువు గా భారత్ కీర్తించబడుతుందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. హనుమకొం డ లోని సెయింట్ పీటర్స్ ఎడ్యు స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా వి ద్యాశాఖ అధికారి ఎల్. వి. గిరిరాజ్ గౌడ్ అ ధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే శాస్త్ర, సాంకేతిక రం గాలలో మరింత పురోభివృద్ధి అవసరమన్నారు.
చైనా వ్యవసాయ రంగంలో కన్నా కూడా పారిశ్రామికరంగ అభివృద్ధితోనే ప్రపంచాన్ని శాసిస్తున్నదన్నారు. స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి ప్రధాని నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతదేశం వ్య వసాయ ఆధారిత దేశంగా గుర్తింపున్నా శా స్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందితేనే అభివృద్ధి సాధిస్తుందని పేర్కొంటూ ఇంజనీరింగ్ కళాశాలలను, పరిశ్రమలను ఏ ర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వి ద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి వచ్చే ఏడాది నుండి నూతన విద్యా ప్రణాళికను ప్రారంభించబోతున్నారన్నారు. విద్యా,వైజ్ఞానిక ప్ర దర్శనకు విద్యార్థులు తీసుకువచ్చే ప్రదర్శనలు సృజనాత్మకతతో కూడిన కొత్త ఆ లోచ నలతో ఉండాలన్నారు. అప్పుడే మంచి శాస్త్ర, సాంకేతిక రంగానికి బాటలు వేసిన వారవుతారన్నారు. విద్యార్థుల పరిశోధనలే దేశ ప్రగతికి సోపానాలు అవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ మేన శ్రీను, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస స్వామి, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ఎంఈఓ నెహ్రూ నాయక్, సె యింట్ పీటర్స్ విద్యాసంస్థలు అధినేత నారాయణరెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్యు విద్యాసంస్థల ప్రిన్సిపల్ ఎన్. హరిత, ట్రస్మా జిల్లా అధ్యక్షులు మాదాల సతీష్, సీఎంఓ బద్దం సుదర్శన్ రెడ్డి, హసన్పర్తి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, కాజీపేట ఎంఈఓ మనోజ్ కుమార్, కోఆర్డినేటర్లు మహేష్, మన్మోహన్, సునీత, వివిధ కమిటీల కన్వీనర్లు, కో- కన్వీనర్లు పాల్గొన్నారు. సైన్స్ ఫెయిర్ ను సందర్శించడానికి మొదటి రోజు హనుమకొండ, ఆత్మకూరు, హసన్పర్తి, శాయంపేట, వేలేరు, భీమదేవరపల్లి, పరకాల మండలాల నుండి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.