విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలి
09-01-2026 12:54 AM
కలెక్టర్ హరిచందన దాసరి
సికింద్రాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నందున తదనుగుణంగా విద్యార్దులకు గుణాత్మకమైన విద్యను అందించి, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం నాంపల్లిలోని ఎల్బి స్టేడియం ఎదురుగా గల ప్రభుత్వ ఉన్నత మోడల్ పాఠశాల ఆలియాను సందర్శించారు. విద్యార్ధుల తరగతి గదులను పరిశీలించి ఉత్తమ ఫలితాల సాధనకై మెరుగైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి డిఇఓ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు, ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.




