09-01-2026 12:55:19 AM
సర్పంచ్ ఎల్గని వెంకటేష్‌గౌడ్
మొయినాబాద్, జనవరి 8, (విజయ క్రాంతి): గత కొన్ని నెలలుగా తీవ్రంగా ఉన్న నీటి సమస్యను బాకారం గ్రామంలోని పదోవ వార్డులో గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ పరిష్కరించారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కలిసి కాలిపోయిన బోరు మోటర్ స్థానంలో నూతన మోటర్ను ఏర్పాటు చేశారు. పదోవ వార్డులోని బోరు మోటర్ గత కొన్ని నెలల క్రితమే కాలిపోవడంతో తాగునీటి కొరత ఏర్పడింది.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా, సమస్యపై స్పందించిన గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి బోరును పరిశీలించారు. అనంతరం బోరును ప్రెస్సింగ్ చేయించి, నూతన మోటర్ను బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుభాష్ చంద్రబోస్ రెడ్డి, వార్డు సభ్యులు కొంతం నాగేశ్వర్ రెడ్డి, రాయనోళ్ల ఉపేందర్ యాదవ్, బంధి అనిల్, నాయకులు కొండకల్ల శ్రీకాంత్, బిక్షపతి గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.