బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యం
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల, జనవరి 8,(విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు నడుం బిగించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ లో కేజీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘ఆరు గ్యారంటీలు’, ఇతర హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు మహాలక్ష్మి పథకం వంటి అంశాల్లో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు , వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




