15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

విద్యార్థులు బాగా చదవాలి

20-02-2026 12:00 AM
  1. ఉత్తమ విద్యార్థులకు నగదు బహుమతి అందిస్తాం 
  2. విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి

జగదేవపూర్, ఫిబ్రవరి 19: విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళా శాలలో వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగదేవ్పూర్ కు చెందిన విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి హాజరయ్యారు. 

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తా ను కళాశాలలో 1983 -85 సంవత్సరంలో విద్యను అభ్యసించినట్లు తెలిపారు. విద్యార్థులు ఏ మార్గంలో విద్యను అభ్యసించాలి అలాగే మొబైల్ అవసరం కొద్దీ వాడాలని, అలాగే దుర్వినియోగం చేస్తే చెడు మార్గంలోని వెళ్తారని మంచి కోసమే మొబైల్ ను వాడాలని తెలిపారు.

అనంతరం రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో లక్ష్మీబాయి మెమోరియల్ ట్రస్ట్   బ్యాంక్ ఖాతాలో చేస్తున్నామని,  మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు  తన తల్లి జ్ఞాపకార్థం  ఫిక్స్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ రూ.60 వేలతో సంవత్సరంలో విద్యార్థులకు బహుమతిగా అంది స్తామన్నారు. 

మొదటి ర్యాంక్ రూ.30వేలు , 2 వ  బహుమతికి రూ.20వేలు, 3వ ర్యాంక్ రూ.10 వేలు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్,ఉప సర్పంచ్ గణేష్,వార్డు సభ్యులు,ఉపాధ్యాయులు, విద్యార్తులు పాల్గొన్నారు.