16 July, 2026 | 12:43 AM

విద్యార్థులు బాగా చదివి వృద్ధిలోకి రావాలి

16-07-2026 12:00 AM

చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి, జూలై 15 (విజయక్రాంతి): విద్యార్థులు ఇష్టపడి బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మున్సిపల్ చైర్మన్ సా త ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నదని తెలిపారు.

అందులో భాగంగా విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తున్నదని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేష్, వైస్ చైర్మన్ జూలకంటి జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు ఫైముదా బేగం, అశోక్, గణేష్, గిరిజ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ మధుర వాణి,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.