07-02-2026 12:24:00 AM
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
తుంగతుర్తి: ఫిబ్రవరి 6 : కష్టపడి చదవండి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి లక్షల రూపాయల బహుమతిని గెలుచుకోండని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రైతు సంఘం కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ మరియు సూర్యాపేట డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య లతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో 10 వ,తరగతి చదువుతున్న విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్న చదువుకో తెలంగాణ మిషన్ పదోతరగతి పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి చదువుపై మరింత శ్రద్ధ పెరిగేలా ప్రోత్సహించి వారు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా మార్గనిర్దేశం చేసే గొప్ప కార్యక్రమాన్ని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తలపెట్టిందని విద్యార్థుల పట్ల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తలపెట్టిన గొప్ప యజ్ఞం విద్యార్థులు బాగా చదివి రాష్ట్ర, నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రధమ ద్వితీయ విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతిని ప్రోత్సహకంగా అందివ్వడం జరుగుతుందన్నారు.
రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాన్ని పొందిన వారికి ఐదు లక్షల రూపాయల నగదు, రెండవ స్థానం పొందిన వారికి 3 లక్షల నగదు, జిల్లా టాపర్ గా నిలిచిన వారికి 2 లక్షల నగదు, నియోజకవర్గస్థాయిలో టాపర్ గా నిలిచిన వారికి ఒక లక్ష బహుమతిని మండల స్థాయిలో టాపర్ గా నిలిచిన వారికి పదివేల నగదు బహుమతిని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున అందివనున్నారని తెలియజేశారు.
కావున మండల పరిధిలోని వివిధ పాఠశాలల విద్యార్థులందరూ వినియోగించుకోవాలన్నారు ఈ మంచి సదవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలలో 2026 మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుందని తెలియజేశారు .విద్యార్థులు కేవలం నగదు కోసమే కాకుండా తమ తల్లిదండ్రుల ఆశయాలను, ఉపాధ్యాయుల లక్ష్యాలను, ఆలోచనలను, సూచనలను పాటిస్తూ ఉన్నత మార్కులు పొందే దిశగా విద్యార్థులంతా తమ తమ లక్ష్యాలను నిర్దోషించు కోవాలని తెలియజేశారు.
అంతేకాకుండా ప్రతి కుటుంబానికి జీవిత బీమా తప్పనిసరి అని బీమా చేసిన ప్రతి వ్యక్తి ధీమాగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ బందెల భరత్ కుమార్, తుంగతుర్తి మండల ఎగ్జిక్యూటివ్ గంట మహేందర్, తుంగతుర్తి డెవలప్మెంట్ ఆఫీసర్ తొట్ల మంజుల సుధాకర్, సేల్స్ ఆఫీసర్స్ చిర్ర నరేష్, గోపగాని లింగమూర్తి, బింగి వెంకటేశ్వర్లు, పులుసు కల్పన సుధాకర్, పొదిల వీరన్న, గుండ గాని లింగయ్య , తదితరులు పాల్గొన్నారు.