25 February, 2026 | 12:15 AM

లక్ష్యం పెట్టుకొని కష్టపడి చదవాలి

24-02-2026 01:14 AM

లక్షెట్టిపేట టౌన్,  ఫిబ్రవరి 23: ప్రతి విద్యార్థి గోల్ సాధించాలంటే లక్ష్యం పెట్టుకొని కష్టపడి చదవాలని మంచిరాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. సోమవారం లక్షేట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేసి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పింగళ రమేష్, మున్సిపల్ చైర్మన్ దోంత అంజలి నర్సయ్య,

మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఆర్టిఎ మెంబర్ అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరీప్, కళాశాల ప్రిన్సిపాల్ లక్మణ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.