విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
01-01-2026 12:49 AM
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా శక్కరనగర్ సమీపంలో ఉన్న అమ్దాపూర్ కస్తూరిబా బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థినులకు, అమ్దా పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 35 మంది 10వ విద్యార్థులకు శ్రీ కావ్య విద్యా విషయక సమాఖ్య ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందించినట్లు సమాఖ్య వ్యవస్థాపకులు బి.మధుసూధనరావు తెలిపారు.
పరీక్షలకు సంబంధించి భయాన్ని పారద్రోలి, ఎలాంటి మెలకువలు, అన్ని సబ్జెక్టులకు సంబంధించి మధుసూధన్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తపాలాశాఖ రిటైర్డ్ ఉద్యోగి భూపతిరెడ్డి, సామాజిక సేవా కార్యకర్త శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.




