calender_icon.png 1 January, 2026 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

01-01-2026 12:49:21 AM

ముకరంపుర, డిసెంబరు 31 (విజయ క్రాంతి): కరీంనగర్లోని వివిధ అల్ఫోర్స్ పాఠశాలల్లో బుధవారం ముందస్తు 2026 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సం వత్సరంలో విజయాలను నమోదు చేయాలని, సమాజ హితంగా కార్యక్రమాలను చేపట్టి ముందంజలో నిలవాలని అన్నారు. ప్రధానంగా విద్యార్థులందరూ తల్లిదండ్రుల ఆ శయాలకు అనుగుణంగా కృషిచేసి లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థు లు ప్రదర్శించిన పలు కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రిన్సి పాల్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.